Ticker

6/recent/ticker-posts

Ad Code

Responsive Advertisement

How to link mobile number in ration card telangana

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అక్టోబర్ నుంచి రేషన్ పంపిణీ మూడో వ్యక్తి ప్రమాణీకరణ(వీఆర్వో, వీఆర్ఏ)ల ద్వారా కాకుండా కింద పేర్కొన్న సూచనల ద్వారా పంపిణీ చేయాలని సూర్యాపేట అదనపు కలెక్టర్ పద్మజారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ తీసుకునేందుకు మూడు ఆప్షన్స్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొదటగా ఓటీపీ ద్వారా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించామన్నారు. ఇందు కోసం కార్డుదారుడు రేషన్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ ని రేషన్ దుకాణానికి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆ రేషన్ కార్డులోని మొబైల్ నెంబర్ తప్పకుండా ఆధార్ తో లింకై ఉండాలని ఎవరైనా మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ కాని పక్షంలో దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి ఆప్డేట్ చేసుకోవాలని సూచించారు. రెండోది ఐరిష్ ద్వారా కూడా రేషన్ పొందడానికి అవకాశం ఉందని ఇందుకు ఈ పోస్ ఇంజినీర్లు, రేషన్ డీలర్లు ఐరిష్ మిషన్లు సరిగా పని చేసేలా చూసుకోవాలన్నారు. మూడోది బయో మెట్రిక్ (ఫింగర్ ప్రింట్) ద్వారా తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 👉 website

Post a Comment

0 Comments