Ticker

6/recent/ticker-posts

Ad Code

Responsive Advertisement

How to check prajaapalana application status 2024 #prajapalana #applicationstatus

 How to check prajaapalana application status 2024 #prajapalana #applicationstatus




తెలంగాణ (Telangana)ప్రజలకు ఆరు గ్యారెంటీ హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్(Congress) పార్టీ ..వాటిని అమలు చేసేందుకు పక్కా ప్రణాళికలను రూపొందించే పనిలో ఉంది. ఇందులో భాగంగానే ఆరు గ్యారెంటీ స్కీములకు అర్హత కలిగిన వాళ్లను ఎంపిక చేసేందుకు గత నెల 28నుంచి జనవరి 6వ తేది వరకు ప్రజాపాలన పేరుతో అభయహస్తం(Abhayahastam) దరఖాస్తులను స్వీకరించింది. ఈ కార్యక్రమాన్నికి జనం నుంచి భారీగా స్పందన లభించింది. రాష్ట్ర జనాభాలో నాల్గో వంతు అంటే కోటి 5లక్షల మంది అప్లికేషన్స్ దాఖలు చేశారు. అయితే దరఖాస్తు చేసుకున్న వాళ్ల అప్లికేషన్స్ స్కృటిని కోసం నెల రోజులు గడువు కోరింది.ఈలోగా రేవంత్ రెడ్డి జనవరి 7వ తేదిన వెబ్ సైట్(Website) ఓపెన్ చేశారు. అందులో ప్రజాపాలన కేంద్రాల దగ్గర ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ రసీదు నెంబర్ ఎంటర్ చేస్తే ఆరు గ్యారెంటీలకు అర్హులో కాదో తెలిసే విధంగా వెబ్ సైట్ ను రూపొందించారు. ప్రస్తుతం ఆ లింక్ లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ వ్యూ కొడితే అప్రూవ్ అయిందా లేక రిజక్ట్ అయిందో తెలుస్తుంది. ఈ లింక్ ను కూడా చాలా మంది ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.

తెలంగాణలో 6 గ్యారెంటీలు అభయహస్తం కోసం భారీగానే దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్లపైగా ఉన్న జనాభాలో నాల్గో వంతు అంటే కోటి మందికిపైగా అప్లికేషన్స్ వచ్చినట్లుగా మంత్రులు తెలిపారు. అయితే ప్రజాపాలన పేరుతో వారం రోజుల పాటు ప్రభుత్వం సేకరించిన దరఖాస్తు చేసుకున్న వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఇటీవలే ఓ వెబ్ సైట్ ని ప్రారంభించారు. ఈ https://prajapalana.telangana.gov.in/Applicationstatus వెబ్ సైట్ లింక్ లో అప్లికేషన్ నెంబర్ తో పాటు కింద బాక్సులో ఉండే కాప్చాను టైప్ చేసి వ్యూ స్టేటస్ క్లిక్ చేస్తే అప్లికేషన్ రిజక్ట్ అయిందా లేక అప్రూవ్ అయిందో తెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Post a Comment

0 Comments